

సీనియర్ జర్నలిస్ట్ పై చర్ల బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు
జనం న్యూస్ 0 5 జూలై( భద్రాద్రి కొత్తగూడెం )
చర్ల మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కుమ్మరి రాంబాబు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల మీద బహుజన సమాజ్ పార్టీ చర్ల నాయకత్వం కొంతకాలంగా లేవనెత్తుతున్న విషయం విధితమే అన్నారు. అనంతరం చర్ల మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో మండల తహశీల్దార్ హెచ్చరిక బోర్డు పెట్టడంతో చర్ల సీపీఎం పార్టీ భౌతిక దాడులకు పాల్పడటం గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఎద్దేవ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోలేక అట్టి ఆక్రమణల పట్ల వార్త రాసిన చర్ల సీనియర్ జర్నలిస్టు రవి కిరణ్ పై, బీ ఎస్ పీ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు.రాజ్యాంగ విరుద్ధంగా జర్నలిస్టులపై, బిఎస్పీ నాయకులపై సిపిఎం పార్టీ అమాయక గిరిజన మహిళలను ఉసగొల్పిభౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని పిరికిపందచర్యగా పేర్కొన్నారు. సిపిఎం పార్టీ పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి ఉంటే స్థానిక మెజిస్ట్రేట్ తాసిల్దార్ వద్ద తమ నిజాయితీని నిరూపించుకుంటూ న్యాయపోరాటం చేయాలన్నారు. అంతేగాని బీఎస్పీ నాయకులపై, కబ్జాల గురించి కథనాలు రాసిన విలేఖరి పై సిపిఎం నాయకులు అమాయకులైన బహుజన ప్రజలను ఉసిగొల్పి భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. సిపిఎం నాయకులకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఉంటే భావ ప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించరని అన్నారు. విలేకరులపై దాడులు, హత్యాయత్నాలు చేసి మిగతా విలేకరులను తమ వార్తలను రాయమనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పేద ప్రజల కుటుంబాలకు బీఎస్పీ పార్టీ ఎల్లప్పుడు అండగానే ఉంటుందని స్పష్టం చేశారు. పోరాటాల ముసుగులో ప్రభుత్వ భూములను కాజేయరాదని హితో పలికారు.శుక్రవారం జరిగిన దాడిలో అమాయక ప్రజలకు గాని, నిజాలు నిర్భయంగా రాస్తున్న విలేఖరుల పై ఏమైన జరిగితే సిపిఎం పార్టీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలను చేయడం ఇప్పటికైనా మానుకోవాలని హితవు చెప్పారు. బీఎస్పీ నాయకులపై, సూర్య పత్రిక విలేకరిపై దాడి హత్యయత్నం చేసిన వారిని, వెనుక ఉండి నడిపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి కొప్పుల నారాయణ బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల సీనియర్ నాయకులు కొండా చరణ్, సామల ప్రవీణ్,చెన్నం మోహన్, గోగికర్ రామ లక్ష్మణ్, గుర్రాల విజయ్, పంబి కుమారి, సుశీల, లక్ష్మి ,త్రిమూర్తులు, కొండ కౌశిక్, ములకల సందీప్, తదితరులు పాల్గొన్నారు.