Listen to this article

జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్ని ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 23 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.6,84,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే మండల కేంద్రంలోని రైతు వేదికలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్నుద్దేశించి మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు…