Listen to this article

జనం న్యూస్ 6జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫార్. జైనూర్ : మండలంలోని పట్నాపూర్ కరీం గూడ గ్రామంలో మొహర్రం ఉత్సవాలు ఘనంగా హాజ్రాట్ బారా ఇమామ్ దేవస్థానంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ కలసి ఆడుకుంటారు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. గ్రామ ప్రజలు మరియు భక్తులు సవారిలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. వచ్చిన భక్తులకు దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగిందని దేవస్థానం వ్యవస్థాపకుడు సైడ్ సాజిద్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.