

జనం న్యూస్ జులై 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అని సీఐ పి రంజిత్ రావు తెలిపారు మండలంలోని మాందరిపేట స్టేజి వద్ద వాహనాలను శనివారం రోజున తనిఖీ చేశారు సీఐ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపవద్దని వాహనానికి సంబంధించిన పత్రాలు ఇన్సూరెన్స్ తప్పనిసరి ఉండాలని తెలిపారు వాహనానికి సంబంధించి ఎలాంటి పేపర్ లేకుంటే నడిపిన యెడల వాహనాన్ని సీల్ చేయబడుతుంది అన్నారు ఈ తనిఖీలో సీఐ వెంట ఎస్సై జక్కుల పరమేష్ పాల్గొన్నారు….