

జనం న్యూస్ జూలై ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీభారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ కాకినాడ మరియు తాళ్లరేవు జూనియర్ కాలేజ్ ఆద్వర్యంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు స్థానిక నందు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీ పెద్దిరెడ్డి రవి కిరణ్ గారు పాల్గొని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరిస్తూ స్వతంత్రానంతరం దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం బలిదానం చేసిన తొలి తరం దేశభక్తుడని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో సంపూర్ణంగా విలీనం అవటానికి వారు చేసిన పోరాటం అసమాన్యమని ఆ పోరాటంలో వారు ప్రాణాలు సైతం అర్పించారని చెప్పారు. నేటి యువత ఇటువంటి మహనీయులు యొక్క జీవిత విశేషాలు తెలుసుకొని స్ఫూర్తి పొంది వికసిత భారతావనికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె సత్యనారాయణ , జిల్లా యువజన అధికారి తిర్రి గోపి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉపాధ్యాయులు విజయ లక్ష్మి కె డి మల్లేశ్వర్ రావు కె ఆర్ వి సత్యనారాయణ మరియు, మై భారత్ న్ వై వి ఎం.ప్రకాష్ పాల్గొన్నారు