

జనం న్యూస్ ;6 జులై ఆదివారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;మహిళా మరియు బాల హక్కులపై అవగాహన పెంచే లక్ష్యంతో రిప్రొడక్టివ్ జస్టిస్ పై షేరింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత సర్టిఫికేట్ కోర్సు ను అందిస్తున్నట్లు చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డా అట్ల మాట్లాడుతూ ఈ కోర్స్ గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ ద్వారా నిర్వహించబడిన శిక్షణ కార్యక్రమంపై ఆధారపడి ఉంటుందని, ఈ కోర్సులో 70% కంటే ఎక్కువ స్కోర్ సాధించి, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) సంజీవి శాంతకుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ నితిన్ మాలిక్ మరియు సెంటర్ హెడ్ డాక్టర్ ఆశా వర్మ నుండి సర్టిఫికేట్ ను తాను అందుకున్నట్లు గుర్తు చేశారు. ఈ కోర్సులో రిప్రొడక్టివ్ హక్కులు, సురక్షిత గర్భస్రావం సేవలు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ సవరణ చట్టం 2020, ట్రాన్స్ జెండర్ మరియు వికలాంగుల హక్కులు, సర్రోగేసీ మరియు బయోఎథిక్స్ వంటి ముఖ్య అంశాలు చర్చించడం జరుగుతుంది అని అన్నారు. ఇది భారతదేశంలో రిప్రొడక్టివ్ జస్టిస్ పై మొదటి కోర్స్ అని డాక్టర్ రెడ్డి వివరిస్తూ, ఇది చట్టపరమైన, వైద్య, నైతిక మరియు సామాజిక అంశాలను కలిపి అధ్యయనం చేస్తుంది. ఈ జ్ఞానాన్ని ఉచితంగా అందించడం ద్వారా న్యాయ, వైద్య మరియు సామాజిక రంగాల్లో పనిచేసే వారిని సాధికారత పర్చడం మా లక్ష్యం అని పేర్కొన్నారు. న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, కౌన్సెలర్లు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆసక్తి గల అభ్యర్థులు ఈ కోర్సునకు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లకు చివరి తేది జూలై 10. మరిన్ని వివరాలకు 9703935321 యందు సంప్రదించాలని కోరారు.