Listen to this article

జనం న్యూస్ 07 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్‌ అంబేద్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు. భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.