

జనం న్యూస్ జులై 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో అమలాపురం పట్టణ ఏఎస్ఎన్ కళాశాల నందు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా కన్వీనర్ శ్రీ ఇళ్ళ సత్యనారాయణ పాల్గొని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను,ఆయన త్యాగాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి హెచ్ న్ కిషోర్,ఉపాధ్యాయులు సూర్యనారాయణ,పిటి ఉపాధ్యక్షురాలు అరుణ మరియు మై భారత్ వాలంటీర్లు సరోజినీ, ఈశ్వర్ పాల్గొన్నారు.
