Listen to this article

జనం న్యూస్ జనవరి 25, (జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా ఈరోజు వారిని నియోజకవర్గ మాజీ సర్పంచులతో కలిసి మోగిలేపేట గ్రామంలో మాజీ సర్పంచ్ నాగరాజు ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరమశించారు, అనంతరం నిన్నటి వరకు తెలంగాణ పరువు పోయేలా జరిగిన గ్రామా సభల తీరు గురించి మాట్లాడారు, తక్షణమే మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లుల విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ…. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తక్షణమే స్పష్టత ఇయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, బిఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు