Listen to this article

జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ 124 జయంతి సందర్భంగా మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చలేంగే అనే నినాదంతో ముందుకు సాగి జమ్ము కాశ్మీర్ అంశమైనటువంటి ఆర్టికల్ 370 రద్దు కొరకు తన ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహానేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత జవహర్ లాల్ నెహ్రూ కపట బుద్ధితోటి శ్యామ ప్రసాద్ ముఖర్జీని జైలు పాలు చేసి జైల్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన కూడా దీక్ష తోటిపోరాటాలు చేసి ఆర్టికల్ 370 యాక్టు రద్దు చేయాలని పోరాటం చేసిన మహా వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కాంగ్రెస్ 370 యాక్ట్ ను రద్దు చేయకున్నా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే కోరుకున్నారో అఖండ భారతావనిని చేయడానికి కంకణ బద్ధుడైన నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దుచేసి ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించారు అదే విధంగా వారి ఆశయాలను పునికి పుచ్చుకొని వారి మార్గంలో నడవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్ బూత్ అధ్యక్షులు బత్తుల రాజేష్, నాయకులు దిండిగారి రమేష్, కూరాకుల చంద్రమౌళి, బత్తుల శ్రీధర్, పల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు….