

జనం న్యూస్ జూలై 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి నియోజకవర్గంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అనకాపల్లి మండలం, జీవీఎంసీలోని 165 అంగన్వాడీ కేంద్రాలకు మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కీలక వస్తువులను పంపిణీ చేశారు. పంపిణీ చేయబడిన వస్తువులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, కుక్కర్, కడాయి, మరియు రెండు గిన్నెలు అందజేశారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అంగన్వాడి కేంద్రాలలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేశారు. అలాగే, ఒక అంగన్వాడీ టీచర్ మరియు ఆరుగురు ఆయా పోస్టులకు ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందించారు. కొణతాల రామకృష్ణ
ఈ సందర్భంగా శాసనసభ్యులు కొణతాల మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు నాణ్యమైన వసతులు కల్పించడానికి కృషి చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పి. ప్రభావతి పాల్గొన్నారు.//