

జనం న్యూస్ జూలై 7
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము విద్యార్థుల స్కాలర్షిప్ అడిగితే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు అని, అరెస్టు చేసిన నాయకులను మరియు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు. పెండింగ్లో ఉన్న 7200 కోట్ల పీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్న పిడిఎస్ యూ విద్యార్థి సంఘం నాయకులను అక్రమ అరెస్టులకు వారిపై లాఠీచార్జిని ఖండిస్తూ, గ్రామమీనా పేద విద్యార్థుల విద్యకు ఆసరాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను స్కాలర్షిప్ ను ప్రభుత్వము ఈ ప్రభుత్వము అన్ని ప్రభుత్వాలు తుంగలో తొక్కుతూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు.