Listen to this article

(జనం న్యూస్ 7జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)

మంచిర్యాల జిల్లా భీమారం మండల కాజిపల్లి గ్రామపంచాయతీ చెందిన గోత్రల వాడలో ఏళ్ల తరబడి రోడ్డును పట్టించుకునే నాయకులు కరువైనారు ఓట్ల కోసం రోడ్డు వేయిస్తామని ఓట్లు దండుకుని కంటికి కనిపించరు, ప్రభుత్వాలు మారిన రోడ్డు సమస్య తీరట్లేదు చిరుజల్లులు పడిన రోడ్డు బుడదమయంగా మారుతుంది స్కూల్ పిల్లల బస్సు అదుపుతప్పే ప్రమాదం పొంచి ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల కోసం భయం భయంగా ఎదురు చూస్తూ ఉంటారు . వర్షం కురిసి రోడ్డంతా బురదమయంగా మారుతుంది. వచ్చి పోయే వాహనదారులకు అదుపుతప్పితే ఆసుపత్రికి, ఆలస్యం అయితే నరకానికి వెళ్ళవలసి వస్తున్నది. గమ్య స్థలానికి చేరుకుంటామో లేదో అని భయాందోళనకు గురవుతున్నారు.. ప్రభుత్వ అధికారులు ఈ పరిస్థితులను పరిశీలన చేసి శరవేగంగా సిమెంట్ రోడ్డు వేయాలని ఈ యొక్క కాలనీవాసులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు సూచనలు చేసి త్వరగా సిమెంట్ రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.