

జనం న్యూస్ జూలై 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు… అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ఎంపిక చేసి వారి ఇంటికే ఆ పథకాలను ప్రతి ఇంటికి ఆ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు అన్నారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో ఈరోజు 4 వ వార్డ్,, బూత్ నెంబర్ 17, మరియు బూత్ నెంబర్19 లో ఈరోజు వార్డు అధ్యక్షులు , బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు,కమిటీలతో వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా సుపరిపాలనలో తొలి అడుగు ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యువతకు ఉద్యోగాలు, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, , ఎన్నో అభివృద్ధి పథకాలు చేయడం జరిగిందని అన్నారు. మరియు వార్డులోని ముఖ్యమైన సమస్యలు అనగా వార్డు ప్రజలు కోరిన డ్రైనేజీ సిస్టం మరియు చేపల మార్కెట్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని నిధులు మంజూరు చేస్తామని శాసనసభ్యుల వారు, పార్లమెంటు సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు,రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి ,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, ముదునూరి రామలింగరాజు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్లకోటి దొరబాబు,జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు,ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు, మరియు క్లస్టర్ దొమ్మేటి రమణ కుమార్, మండల టిడిపి అధ్యక్షులు అర్థాన్ని శ్రీనివాసరావు, ములపర్తి బాలకృష్ణ, దివి మహాలక్ష్మి,పిల్లి నాగరాజు, గొల్లపల్లి గోపి,దివి విజయ్, లోకనీడు వెంకటేశ్వరరావు,విల్ల వీరస్వామి నాయుడు, 4వ ఇంచార్జ్ కాకి మాణిక్యం, వాసంశెట్టి అమ్మజి, 17వ బూత్ కన్వీనర్ ర్యాలీ ప్రసాద్,19 వ బూత్ కన్వీనర్ జాగు సత్తిబాబు , బొక్క రుక్మిణి, మెండి కమల , కుడిపూడి మల్లేశ్వరి, అత్తిలి లక్ష్మీ ప్రసన్న,నిమ్మకాయల విశ్వేశ్వరరావు, నడింపల్లి శ్రీనివాసరాజు, సీలం శ్రీనివాసరావు, నీతిపూడి వంశీ, బొక్క సురేష్, నక్క సత్యనారాయణ, కాశి లాజర్, ఎల్లమల్లి వెంకటేశ్వరరావు, సీలం పండు, గోరింట శ్రీను రాజు, పాయసం చిన్ని, జాగు రాంబాబు, నడింపల్లి కుమార్, జగతా తాతలు, రెడ్డి శ్రీను ,రెడ్డి సుధీర్, మట్టపర్తి సత్యనారాయణ, కాండ్రేకులు శేషగిరిరావు, గడ్డం శ్రీనివాసరావు, చప్పిడి దుర్గాప్రసాద్ , పితాని నరసింహామూర్తి, దోనబోయి నాగేశ్వరరావు, చంటి రాజు, గోరింట శ్రీను రాజు, పెనుమత్స సురేష్ వర్మ, సానబోయిన సోమయ్య, కంచర్ల సురేష్, జనపల్లి సత్యనారాయణ మాస్టారు, కడలి వీరంశెట్టి, సానబోని లక్ష్మీనారాయణ,మొదలగు వారు పాల్గొన్నారు.
