

ధర్మ సమాజ్ పార్టీ నాయకులు బొంకూరి రాజు..
జనం న్యూస్ 7 జూలై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి యూరియా కేటాయింపులో కోత విధించడంపై ధర్మ సమాజ్ పార్టీ నాయకులు బొంకూరి రాజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తీవ్రంగా విమర్శించారు తెలంగాణ రైతాంగానికి ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకు గాను ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా కేవలం 3లక్షల 75 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరాఫరా చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇంకా రెండు లక్షల 25వేల మెట్రిక్ టన్నులను కోత విధించడం వలన రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అన్నారు ఇప్పటికే అప్పులు తెచ్చి పంటలు వేసిన రైతాంగం సరైన సమయంలో ఎరువులు వేయకపోతే పంట నష్టం వాటిల్లుతుందని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రానున్న మూడు నెలల్లో సైతం రైతులకు ఎరువుల కొరత సమస్య ఏర్పడితే ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంలో విఫలమైతే రైతులకు పెట్టిన పెట్టుబడి సైతం నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయడంలో మన రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు చొరవ చూపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా అయ్యేలా చూడాలి మన దేశానికి వెన్నెముక అయినా రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా బొంకూరి రాజు అన్నారు.