Listen to this article

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- అనకాపల్లి నియోజకవర్గం
శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారు గవరపాలెం పండగ మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ, మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్,, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర అమ్మవారును దర్శించుకోవడానికి సతకంపట్టు వద్ద ఉన్న అమ్మవారి కోవెలకు వెళ్లి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవస్థానం కమిటీ సభ్యులు కొణతాల ప్రసాద్ శాలువాలు తో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.//