

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు..
సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎమ్మార్పీఎస్ సేవలు ప్రశంసనీయం..
ఎమ్మార్పీఎస్ నాయకులు కలుగురా రాజ్ కుమార్
(జనం న్యూస్ 7 ,జులై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం సందర్భంగా, పోడేటి రవి గాలిపెల్లి సత్యనారాయణ ముంజం సత్యనారాయణ తగురం మొండి పోడేటి అశోక్ జంగా పెళ్లి పున్నం ఆధ్వర్యంలో, ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. . తదనంతరం పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ… సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి యం.ఆర్.పి.ఎస్. చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు, అన్ని సంఘాల నాయకులు మరియు అన్ని పార్టీ లా నాయకులు పాల్గొన్నారు.