Listen to this article

జనం న్యూస్- జూలై 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు ఈనెల 6వ తారీఖున సూర్యాపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన అండర్ 18 బాస్కెట్బాల్ సెలక్షన్స్ యందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన జే సుప్లవి రాజ్, ఎస్కే రిజ్వానా, డి కరుణ, కే మహేష్, జహీరా, బి పూజ లు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లుగా సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పిఈటి కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు ఈనెల 11 నుంచి 13వ తారీకు వరకు గద్వాల జిల్లా ఉత్తనూర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్ళనున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత, సిస్టర్ క్లారా, పిఈటి కిరణ్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.