Listen to this article

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బిచ్కుంద జులై 7 జనం న్యూస్

రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించారు. పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గజ మాలతో ఘనంగా స్వాగతం పలికారు. జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 17.96 కోట్ల నిధుల వ్యయంతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించిన ఆయన నియోజక వర్గంలో ఆగిపోయిన లెండి, నాగ మడుగు ప్రాజెక్ట్ పనులు సత్వరమే పూర్తి అయ్యేలా చూస్తానని అన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, రాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీస్ ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు ఉన్నారు. మంత్రి పర్యటన పూర్తి వివరాలు… కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం పర్యటించారు. ముందుగా పిట్లం మండలంలో 4.86 కోట్ల వ్యయంతో నిర్మించిన తిమ్మనగర్ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆయన, 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే బిచ్కుంద నుండి డోంగ్లి రోడ్డు పనులకు శంఖు స్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లెండి, నాగమడుగు ప్రాజెక్ట్ పనులు సత్వరమే పూర్తి అయ్యేలా చూస్తానని అన్నారు. బిచ్కుంద, పిట్లం పట్టణాలలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి అయ్యేలా ఆదేశాలు జారి చేశానన్నారు. ప్రజా పాలన పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. 4 ఏండ్లలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హమీలనే కాకుండా ఇయ్యన్ని హామీలను సైతం నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందని విమర్శించారు. దళితున్నీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు.ఉద్యోగాల గురించి కేసీఆర్ ఎప్పుడు పట్టించుకోలేదని వారింట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉండేలా చూసుకున్నాడని ఎద్దేవాచేశారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ కు సిగ్గు లేదన్నారు. 750 కోట్లతో తన ఫామ్ హౌజ్ చుట్టూ నాలుగు లైన్ల రొడ్డును వేసుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. 10 ఏండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళను ప్రజలు నమ్మవద్దని హితవు పలికాడు. ఈ కార్యక్రమంలో