

జనం న్యూస్ ;7 జులై సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
భారతి సాహితీ సంస్థ కోరుట్ల వారు అందిస్తున్న అందె వెంకటరాజము స్మారక పురస్కారంకు సిద్దిపేటకు చెందిన అవధాని బండకాడి అంజయ్య గౌడ్ ఎంపికైనట్లు కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. సినారె కళాభవనము కోరుట్ల నందు జూలై 12 శనివారం రోజున అంజయ్య గౌడ్ పురస్కారం అందుకుంటారన్నారు. పద్య సాహిత్యంలో విశేష సేవ చేస్తూ అందె వెంకటరాజము పురస్కారానికి అంజయ్య గౌడ్ ఎంపీక కావడం పట్ల సిద్దిపేటకు చెందిన కవులు వరుకోలు లక్ష్మయ్య, సింగీతం నరసింహారావు, ఆదిమూలం చిరంజీవి, బస్వ రాజ్ కుమార్, నల్ల అశోక్ తదితరులు అభినందనలు తెలిపారు.