Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్):అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం వెదురువాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకుని అరగంట పాటు క్రీడాకారులతో ఎమ్మెల్యే సరదాగా బ్యాటింగ్ ఆడారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,జనసేన,టీడీపీ,బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.