Listen to this article

జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన బోధించేందుకు అతిధి ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి ఈ నెల 10 గురువారం రోజున డెమో మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలోని ఎంజేపీ పాఠశాలలు మరియు కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తెలుగు (జెఏల్ జనరల్ 1 టీజీటీ పీజీటీ జనరల్ -1 )) హిందీ పీజీటీ మహిళ 1)ఇంగ్లీష్ పీజీటీ జనరల్ 1 జెఎల్ జనరల్ 1) మ్యాథ్స్ JL మహిళ_1) జనరల్ -1) ఫిజిక్స్ పీజీటీ మహిళ -1 ) కెమిస్ట్రీ జనరల్ _1) సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ), బీఈడీ పూర్తి చేసి టెట్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ గురువారం రోజున డెమో మరియు ఇంటర్వ్యూకి మంచిర్యాల జిల్లాలోని లక్షటి పేట్ బాలుర పాఠశాలలో మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో ఉదయం 9 గంటలకు తమ బయోడేటాకి, విద్యార్హతల జిరాక్స్ పత్రాలను జతపరచి, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా జిల్లా డి సీ ఓ శ్వేత తెలియచేసారు.