Listen to this article

జనం న్యూస్ 06 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం )

సుజాతనగర్ మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇల్లుల కేటాయింపు లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారి అవకతవకలు చేయడం జరిగిందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు బేతంపూడి పంచాయతీలో 34 ఇందిరమ్మ ఇల్లులు మంజూరై తరువాత వాటిని 28 ఇల్లులకు కుదించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొంతమంది వద్ద 50వేల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోవడం వలన నిజమైన అర్హులు ఇందిరమ్మ ఇల్లులను పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి విషయాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు గుర్తించి తమకు ఇందిరమ్మ ఇల్లులు కేటాయించాలని గ్రామపంచాయతీ ఆఫీస్ ముందు కళ్ళు చెవులు మూసుకుని తమ నీరసనను వ్యక్తం చేశారు ఈ సమావేశ సందర్భంగా పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురిమెల్ల శంకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీల నియామకాలను వెంటనే రద్దు చేయాలని నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లులు కేటాయించాలని అలా జరగకపోతే ఈ సమస్యను పరిష్కారం అయ్యేవరకు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని జిల్లా కలెక్టర్ ని కలుస్తామని అట్టి పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబం అంగవైకల్యం కలిగినటువంటి వారి వద్ద నుండి 50 వేల రూపాయలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీసుకోవడం తీవ్రంగా ఖండించారు వెంటనే కమిటీ సభ్యుని పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు