

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- మునగపాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరులు అమ్మవారి మహోత్సవ ఆహ్వాన పత్రిక ను స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మునగపాక గ్రామంలో 01-02- 2025 శనివారం నాడు అత్యంత వైభవంగా జరుపుటకు సన్నాహాలు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్ల జయలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు టెక్కులి పరశురాం, దాడి ముసలి నాయుడు, సూరిశెట్టి కన్నారావు, హై స్కూల్ చైర్మన్ ఆడారి సూర్యచంద్రరావు, సూరిశెట్టి అప్పలనాయుడు, అప్పలనాయుడు, సుందరపు ధనలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.//