

జనం న్యూస్ 25 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యంగా విలువలు కాపాడాలన్నా, సరైన నాయకులను చట్ట సభలకు పంపించాలి. అలాంటి వారిని ఎన్నుకుని మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క యువతీ, యువకుడు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకుని, విధిగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరుతున్నాను. ఓటు అంటే మనము ఆడే ఆట కాదు ఓటు అంటే మన జీవితాలని పోషించుకునే ఓటు హక్కు ఆనాడు బాబా సహాయం డాక్టర్ అంబేద్కర్ ఓటు హక్కును పెట్టినందుకు ఈరోజు మనం ప్రజలు బ్రతికి బయటపడుతున్నాము లేకపోతే ఈరోజు డబ్బు ఉన్న వాళ్లకు హోటక్ కావాలని కోరుకునే వాళ్ళు అయినా యువత ఓటు హక్కు గురించి తెలియక చాలా పొరపాటు చేస్తున్నారు ఓటు హక్కు అంటే మన జీవితమని తెలియక పొరపాటు చేస్తున్నారు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు
మీ… డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా రిపోర్టర్