Listen to this article

జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కేపిహెచ్బి కాలనీ బస్టాండ్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వంటి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరియు బాలాజీ నగర్ హలో కృష్ణ రాజ్ పుత్ ఆధ్వర్యంలో మరియు బాలనగర్ లో నాగిరెడ్డి ఆధ్వర్యంలో అల్లాపూర్ మస్తాన్ రెడ్డి రంగారావు ఆధ్వర్యంలో ప్రాంతాల్లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి రమేష్ నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అబ్బాయి రోజు జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, యన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, యస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.