Listen to this article

(జనం న్యూస్ చంటి జులై 8)

ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం 41_దుబ్బాక శాసనసభ నియోజకవర్గం గురించి ఈరోజు రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె ఓటర్ బూతు స్థాయి గురించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పించాలని ఆమె సూచించారు. మరియు ఒకే ఊరిలో ఒక వ్యక్తికి రెండు పేర్లు ఉంటే ఒక పేరు తొలగించాలని ఆమె సూచించారు. ఇంటింటి సర్వే చేసి జనాభా లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఆమె తెలిపారు. ఈరోజు ట్రైనింగ్ తీసుకునే వారికి తమ సూచనలు చేశారు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది . దౌల్తాబాద్ మరియు రాయపోల్ రెండు మండలాలు కలిసి ఒకే దగ్గర శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు ఎమ్మార్వో చంద్రశేఖర్. రాయపోల్ ఎమ్మార్వో కృష్ణ మోహన్ రావు. ఎంపీడీవో వెంకటలక్ష్మి. ఆర్ఐ ప్రభాకర్. సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్. గిరద వారి నాగరాజు. మరియు రెవెన్యూ సిబ్బంది అంగన్వాడి టీచర్లు స్థానికులు ఇందులో పాల్గొనడం జరిగింది.