Listen to this article

ప్రధానోపాధ్యాయులు వెంకటేష్,

జనం న్యూస్,జులై 08,కంగ్టి

సంగారెడ్డి కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ కేంద్ర ప్రాథమిక పాఠశాల లో మంగళవారం పిటిఎం సదస్సు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేష్,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు పిల్లల తల్లి తండ్రులు పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి రాగానే తమ పిల్లలకు ఇచ్చిన హోంవర్క్ ను ఎప్పటికప్పుడు చూడాలని అన్నారు. చిన్నారులకు సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంచాలని సంరక్షకులకు సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, పుస్తకలు కాపీలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత గలా విద్యను బోధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ తులసిరాం, శ్రీనివాస్,ప్రమోద్ చారి,అనిల్,అశ్విని,మురళీ కృష్ణ,శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు