Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్):అచ్యుతాపురం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఇటీవల నిర్వహించిన హిందీ పరీక్షల్లో హరిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపాద రవి అన్నారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి హిందీ పండితులు షేక్ బాషాను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులు హిందీ పరీక్షల్లో పాల్గొని శత శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ధర్మిరెడ్డి రాజు మరియు ఆధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.