

జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజున వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల ప్రజలలోకి చొచ్చుకెళ్లే పథకాలు కాంగ్రెస్ హయాంలో వైయస్సార్ ప్రవేశపెట్టారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి చారిత్రాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ఆర్ ది అని అన్నారు . ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిందం రవి, మారపెల్లి రవీందర్, మారపెల్లి రాజు, లడే రాజ్ కుమార్, మసికే కుమార్, మారపెల్లి రాజేందర్, మాడిశేట్టి చిరంజీవి, మామిడి సుదర్శన్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు…..