Listen to this article

జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఈరోజు రెబ్బెన మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా రమేష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ పథకం, అత్యవసర ఉచిత వైద్య సేవల కోసం 108, 104 వంటి బృహత్తర కార్యక్రమాలు అమలు చేసిన మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు..మహానేత వైయస్ స్పూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. పదేళ్లలో తెరాస హయంలో నిలిచిన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ ప్రజా పాలనలో మళ్లీ ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.