

(జనం న్యూస్ చంటి జులై 8)
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ నందు యాంటి డ్రగ్స్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరుగుతున్న చెడు అలవాట్లను దూరంగా ఉంటూ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి అలవాటులను అలవర్చుకోవాలని బాగా చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అలాగే స్టూడెంట్ కౌన్సిలర్ బి. శివకుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యార్థినీ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని చిన్న వయసులోనే చెడు అలవాట్లకు లోనై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని అలా కాకుండా విద్యార్థులు చెడు వ్యసనానికి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క మాటలు వినుకుంటూ గురువుల మాటలు వినుకుంటూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో గొప్పవారు కావాలని సూచించడం జరిగింది సమాజంలో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకొని అనేక రకాల సమస్యలకు లోనవుతున్నారని అలా కాకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాన్ని చేరుకున్న తర్వాత విద్యార్థులు పెళ్లి చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలాగే పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ స్టేషన్లోని కానిస్టేబుల్ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలంటే సమాజంలో జరిగే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మత్తు పదార్థాలపై అలాగే సైబర్ నేరాలపై సమాజంలో జరిగే అనేక రకాల నేరాల గురించి సెక్షన్ల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మంగత నాయక్, సంపత్ అధ్యాపకులు రాజు, శ్రీనివాస్ రెడ్డి ,శ్రీను, సుధాకర్ లక్ష్మీనారాయణ ,పవన్ కుమార్ రమ్య.. తదితరులు పాల్గొన్నారు.
