

జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా రాష్ట్ర పార్టీ మరియు ఏస్సీ మోర్చా పిలుపు మేరకు కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన sc మోర్చా మరియు టౌన్ అధ్యక్షులు శివ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు సంవిధన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించ్చి అంబేద్కర్ విగ్రహానికి నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఏస్సీ మోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి తోట అజేయ్ కుమార్ పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతు భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది.1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.రాజ్యాంగాన్ని గౌరవించే పార్టి భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది ఆ నాటి భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేశారు 2014 సంవత్సరంలో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం
భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారతదేశ ప్రజలకు న్యాయం చేసే దిశగా సాగుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అన్నారు.
నెహ్రూ హయాంలో అంబేద్కర్ ని అవమానించి అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు, కాంగ్రెస్ పార్టీ వాస్తవాన్ని తుంగలో తొక్కి పబ్బం గడుపుకోడానికి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అన్నారు, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వాస్తవాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ కి చేసిన అవమన్నని, మోసాన్ని ఇప్పటికైనా ప్రజాలు వాస్తవాలును తెలుసుకోవాలని కొర్యారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమ్మరి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల విశ్వేశ్వరరావు చంన్కపురి గణపతి ముత్తు అశోక్ జిల్లా కోశాధికారి అరుణ్ లోయ జిల్లా అధికార ప్రతినిధి సమీర్ గుప్తా పట్టణ ఎస్సీ మోర్చ అధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు పారేపల్లి రాణి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వనపదాసు శ్రీదేవి కిరణ్ బేడి,బానక్కసీనియర్ నాయకులు కొప్పుల శంకర్ కాగజ్ నగర్ మండల అధ్యక్షులు పుల్ల అశోక్ పిరిసింగుల తిరుపతి కొండ్ర మనోహర్ గౌడ్ చేరాల శ్రీనివాస్ నీకోడే అర్జున్ ప్రణయ్ అనీల్ సంతోష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.