

జనం న్యూస్ 08 (మహబూబాద్ )
మరిపెడ బంగ్లా మండలం ఎల్లంపేట గ్రామ నివాసులైన లింగంపల్లి బిక్షపతి మరణం రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమాజాన్ని, ఆలోచన రేకెత్తించింది ఆలోచన రేకెత్తించినది నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు కొత్తగూడెం నియోజకవర్గ భోజనం సమాజ్ పార్టీ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్ మాట్లాడుతూ లింగంపల్లి బిక్షపతి మరణం నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి తీరని లోటు అని ఆయన జీవితాన్ని ఆయన ఆచరించిన సిద్ధాంతాలను నెమరు వేసుకుంటూ జీవితం మొత్తం కూడా సమాజ సేవకే అంకితం చేయడం చాలా గొప్ప వ్యక్తిత్వం వయస్సులోనే జైలు జీవితం గడపడం అతనిపై 21 కేసులో నమోదు కావడం అంటే ఆయన పోరాటాన్ని ఆ స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు ఆనాటి వెట్టిచాకిరి, చేసిన పోరాటాలు గర్వించదగినవి మరి అదే విధంగా తన కుమారుడు లింగంపల్లి దయానందు కూడా తండ్రి చూపిన మార్గంలోనే పయనిస్తూ నిత్యం సమాజ సేవలో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ జన విజ్ఞాన వేదిక బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యత ప్రజలను చైతన్యం చేయడంలో నిమగ్నం కావడం కూడా తన తండ్రి పెంపకాన్ని గుర్తుచేస్తుంది అని తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్నివేళలా మానసిక ధైర్యం ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెన్నారం మల్లేశం నివాళులు అర్పించారు