Listen to this article

జనం న్యూస్ 09 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినజిల్లా ఎస్సీ. పకుల్ జిండల్, ఐపిఎస్ ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, కిరాణ షాపుల్లో తనిఖీలను స్వయంగా చేపట్టిన జిల్లా ఎస్సీ వకుల్ జిండల్, ఐపిఎస్ జిల్లాలో విద్యాసంస్థలకు సమీపంలోని పాన్షాపులు, కిరాణా షాపుల్లో సిగరెట్స్, నిషేధిత ఖైనీ గుట్కాలు, మత్తు కలిగించే చాక్లెట్స్ వంటి వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిండల్ జూలై 8న హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో స్థానిక పోలీసులు, ఈగల్, ఎస్బీ పోలీసులు సంయుక్తంగా విద్యాసంస్థలకు దగ్గరలోగల పాన్ షాపులు, కిరణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, జిల్లా ఎస్పీ వకుల్ జిండల్, ఐపిఎస్ గారు స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పకుల్ జిండల్, ఐపిఎస్ మాట్లాడుతూ విద్యా సంస్థలకు సమీపంలో సిగరెట్స్, నిషేధిత పాన్పరాక్, గుట్కాలు, మత్తు కలిగించే చాక్లెట్స్ వంటి వస్తువులను విక్రయిస్తే, ఆయా షాపుల యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విజయనగరం పట్టణం లోని బాలాజీనగర్ లోని శ్రీనివాస, ఆదిత్య, చైతన్య డిగ్రీ కళాశాల సమీపంలోని పాన్ షాపుల్లో జిల్లా ఎస్పీ పకుల్ జిండల్ మరియు ఇతర పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 15 షాపుల్లో తనిఖీలు చేపట్టి సిగరెట్లును స్వాధీనం చేసుకొని, వారిపై కోట్పా చట్టం క్రింద కేసలు నమోదు చేసి, జరిమానాలు విధించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, మత్తు కలిగించే ఎటువంటి వస్తువులు విక్రయించకూడదన్నారు. ఇలా ఎవరైనా విక్రయాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలకు సమీపంలోని షాపుల్లో విక్రయాలు చేయడం వలన విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటుపడి, చివరకు బానిసలవుతారన్నారు. కావున, వ్యాపారులు విజ్ఞతతో వ్యవహరించాలని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విక్రయాలకు స్వస్తి పలకాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహా దాడులను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేసారు.ఈ ఆకస్మిక దాడుల్లో విజయనగరం డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐఐలు ప్రసన్నకుమార్, రామగణేష్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఈగల్ టీమ్, మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.