

జనం న్యూస్ జూలై 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జీవీఎంసీ ఎస్ ఈ ఈరోజు ఉదయం 84 వ వార్డులో కోట్ని వీధి నుండి రింగ్ రోడ్డు జంక్షన్ కు వచ్చే ప్రధాన మురికి కాలువ ను అభివృద్ధి పరచాలని,నీరు పారకపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని కోట్ని వీధి లక్ష్మీనారాయణ నగర్, రింగ్ రోడ్డు ఏరియా లో ఉన్న ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్ చినతల్లి నీలబాబు స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడి, ఇటీవల వచ్చిన జీవీఎంసీ ప్రధాన కమీషనర్ ఆదేశాలతో 84 వార్డులో ఎస్ ఈ కోట్ని వీధి లక్ష్మీనారాయణ నగర్ రింగ్ రోడ్డు చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు అన్ని ప్రాంతాల్లో పర్యటన చేశారని రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని లైటింగ్ సుందరీకరణ పనులను త్వరితగతన పూర్తి చేయాలని కార్పొరేటర్ చిన్న తల్లి నీలబాబు ఎస్ ఈ ను కోరారు. ఈ సందర్భంగా 84వ వార్డ్ ఇంచార్జ్ నీలబాబు మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ప్రజలకు అత్యవసరంగా కావాల్సిన పనులను వేగవంతం చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని ఎస్ ఈ కి నీలబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోన్ ఇంజనీరింగ్ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు./