

జనం న్యూస్ జూలై(9)
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంమైన తుంగతులో బుధవారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. పనులవై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై పొర్లుదండాలు పెట్టారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ సహకారంతో అంబేద్కర్ విగ్రహా చౌరస్తా నుండి కోర్టు మీదుగా సిరి ఫంక్షన్ హాల్ వరకు రోడ్డు వెడల్పు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు కోసం మూడు కోట్ల యాభై లక్షలు మంజూరై శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. తరువాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సర కావస్తున్న పనులు మాత్రం మొదలు పెట్టలేదని అన్నారు. దీని వెనుక ప్రస్తుత ఎమ్మెల్యే మందులసామెల్ నిర్లక్ష్యం ఉందని దుయాబట్టారు. ముఖ్యంగా మొదటి నుంచి తుంగర్తి అంటేనే ఎమ్మెల్యే సామెల్ అయీష్టత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రెండేళ్ల కాలంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.