

బి ఎస్ ఎస్, దళిత సంఘ నాయకుల డిమాండ్.
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు అర్హులకు న్యాయం జరగాలని విలేకరుల సమావేశంలో బిఎస్ఎస్ దళిత సంఘ నాయకులు మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అరికిళ్ల దేవయ్య, మారపల్లి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంపై నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్పారని, ఆ తల్లి యొక్క రుణం తీర్చుకుందాం అని ప్రజలంతా ముక్తకంఠంతో ఆమె ఆశయాలను సాధించాలని, అధికారాన్ని అప్పజెప్పడం జరిగింది,
కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న నాలుగు గ్యారెంటీ ల అమలులో భాగంగా ఎక్కడ అవకతవకలు జరగకుండా, అసలైన అర్హులకే లబ్ధి చేకూరాలని ఈ సందర్భంగా అన్నారు. కానీ కొన్నిచోట్ల అందుకు భిన్నంగా అసలైన లబ్ధిదారుల పేర్లు కనీసం లిస్టులో కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇట్టి విషయంపై స్థానిక ఎంపీడీవో ని వివరణ కోరగా ఆ లిస్టు తో మాకు ఎటువంటి సంబంధం లేదు అవి పైనుండి వచ్చాయి అని మాకు తెలియదు అని మండలాధికారి చెప్పడం విడ్డూరమని అన్నారు,
ప్రభుత్వ అధికారుల మాట తీరు చూస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు, అసలైన అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎస్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, జిల్లా నాయకులు మారపల్లి విజయ్, బాధితులు తుడుం రవీందర్, వరలక్ష్మి, పాపయ్య, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు….