

జనం న్యూస్ 9జూలై కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. జిల్లా స్టాఫ్ రిపోటర్.
జైనూర్ మండలం పట్నపూర్ శ్రీ సిద్దేశ్వర్ సంస్థాన్ యందు గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా బాబా సతీమణి ఇంగిలే దుర్పత బాయి చేతుల మీదుగా శ్రీ పూలజీ బాబా సమాధి పూజ చేసి జెండా ఆవిష్కరించారు అనంతరం ధ్వజ స్థంభం వద్ద పూజ చేసి జ్యోతి ప్రజ్వల ధ్యాన దరణతో కార్యక్రమం ప్రారంభించారు సంస్థాన్ యందు వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అని కమిటీ సభ్యులు తెల్పారు. సంస్థాన్ యందు అవాంఛనీయ సంఘటనలు జర్గాకుండా పోలీస్లు బారి బందోబస్తు ఏర్పాటు చేశారు సంస్థాన్ యందు జైనూర్ సీఐ రమేష్ పర్యవేక్షణ చేశారు. ప్రతి ఒక్కరు పోలీసిబ్బందికి సహకరించాలని భక్తులకు తెల్పారు.ఈ కార్యక్రమంలో సంస్థాన్ గౌరవ ఆద్యుక్షుడు ఇంగిలే వమాన్ ,ఇంద్రవెల్లి మార్కెట్ చైర్మన్ ముఖడే ఉత్తమ్, తాజా మాజీ సర్పంచ్ కుంరా కేశవ్, ఖందార్ బాలాజీ కమిటీ సభ్యులు దాదా రావు, దుక్రే సుభాష్ గ్రామ పటేల్ గంగాధర్ రంగారావు యుర్వేత దంబి కుంరా మనిక్ రావు తదితరులు పాల్గొన్నారు

