

జనం న్యూస్ జులై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
రాందేవ్ రావు హాస్పిటల్ లో జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సత్యనారాయణను పరామర్శించి ఆస్పటల్ సి ఈ ఓ యోబు ని కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు 12 మంది కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతతొ తమ హాస్పిటల్ కి వచ్చారని వారిలో 11 మందిని నిమ్స్ హాస్పిటల్ కి తరలించామని ఒకరికి వైద్యం చేస్తున్నామని వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు యోబు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ కూకట్‌పల్లి,శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కల్తీకల్లు ,గంజాయి యొక్క ప్రభావం పేద ప్రజల పై, యువతపై అధికంగా ఉందని ఆప్కారి వ్యవస్థ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అక్రమంగా కల్తీ కల్లు, మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారికి ఎటువంటి రాజకీయ అండ ఉన్నా వారి పై కఠిన చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై నిఘా ఉంచుకోవాలని కోరారు. కల్తీ కల్లు అమ్మిన వారిని పోలీసు అధికారులు వెంటనే అరెస్టు చెయ్యాలని అట్టి కల్లు దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని ఎటువంటి రాజకీయ వత్తిడిలతో దోషులను వదిలేస్తే జనసేన పార్టీ ఉపేక్షించదని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్ ,కలిగినీడి ప్రసాద్ పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
