

జనం న్యూస్ 9జూలై కొమురం భీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోటర్.
జైనూర్:పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలను జైనూర్ లో ఘనంగా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం
ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసి అంచెలంచెలుగా రాజకీయ రంగంలో రాణిస్తూ పేదల పక్షపాతిగా నిలిచి పోయారని గుర్తు చేశారు.మహిళ సాధికారత కోసం సీతక్క చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పంద్ర షెక్కు, ఆత్రం భుజంగరావు, సీనియర్ నాయకులు మెస్రం అంబాజీ, ఆత్రం శంకర్ రాజా,, కనక గంగారం, షేక్ హైదర్ ,మాజీ కో ఆప్షన్ సభ్యుడు అప్రోజ్, అబ్బు, రహీమ్, తుమ్రం కొటేష్, యాదవ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
