Listen to this article

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణk- విశాఖపట్నం : సంకల్ప యాత్రలో భాగంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వైజాగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం నుంచి ఐదు కిలోమీటర్ల రన్ కార్యక్రమాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు టాటా ఏఐఏ సంకల్పయాత్ర జెండా ఊపి ప్రారంభించారు.ఈ 5 కే రన్ లో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ రాజీవ్ లబాల,టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ కృష్ణ సుధీర్, టాటా ఏఐఏ అసిస్టెంట్ మేనేజర్ సురేష్,పృధ్విరాజ్, సీనియర్ లీడర్ జగన్నాథ్ కావలి,బిజినెస్ అసోసియేట్ నాగభూషణం, టీం లీడర్స్ ధర్మేష్, చంద్రశేఖర్,సత్య భాను, సునీల్ కుమార్,వినయ్ శైలేష్, దుర్గాప్రసాద్, గణపతి, శంకర్రావు, మహమ్మద్ నసీం, సులోచన, పూజ రాణి మంజులత లావణ్య కృష్ణవేణి గీతామాధువి లత, అడ్వైజర్లు సీనియర్ లైఫ్ ప్లానర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దయనందన జీవితంలో లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలని అన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టాటా ఏజెన్సీ రాజీవ్ లభాల మాట్లాడుతూ సంకల్ప యాత్రలో భాగంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ 5కె రన్ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ నీ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ సుధీర్ కృష్ణ మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవిత బీమా అవసరం ఉందని అందరూ టాటా ఏఐఏలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.