Listen to this article

జనం న్యూస్ జులై 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

వాంకిడి మండల కేంద్రంలో నీ ముండ ప్రహ్లాద్ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించే బుద్ధునితో నా ప్రయాణం అనే తెలుగు నాటికను మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు. బాగ్వాన్ బుద్ధుడు ప్రపంచానికి అందించిన శాంతి మార్గాన్ని మరింత విపులంగా తెలుసుకోవడం కోసం ఈ నాటికను ప్రతి ఒక్కరు చూడ దగిందని,యుద్ధం వద్దు, శాంతే ముద్దు అని బుద్ధుడు సర్వ మానవాళికి చెప్పిన మార్గాన్ని కొత్తంకోణంలో చూపబడుతుందని భారతీయ బౌద మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్, సమత సైనిక్ దళ్ జిల్లా బాధ్యులు దుర్గం సందీప్,అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుర్గం దుర్గాజి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హైదరాబాద్ నుండి మాజీ డిజిపి ఆంజనేయ రెడ్డి, లతారాజ ఫౌండేషన్ , అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ చైర్మెన్ కే.కే రాజా,భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు, తోపాటు మరికొంత మంది హాజరవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సంఘం అధ్యక్షులు శ్యామ్ రావు లహుజి దుర్గే, రాజేశ్వర్ ఉప్రే, వర్ష వాస్ కమిటీ అధ్యక్షులు పాండుజి జాడే ,సంఘం నాయకులు,జయంత్ కుమార్ ,రోషన్ ఉప్రే, ప్రతాప్, మనోజ్, జయరాం,దుర్గం దీపక్, స్వాగత్ ,మారుతి,ఇంద్రజిత్, చునార్కర్ లడ్డు,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.