

జనం న్యూస్ జూలై 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలాని ఉద్యాన శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ బి బాబు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఉన్న పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో పెంచుతున్న ఆయిల్ పామ్ నర్సీరిని సందర్శించారు. ఆయిల్ పామ్ నర్సరికీ ఎక్కడి నుండి మొలకలు తెస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.మొక్కల పెంపకం లో తీసుకుంటున్న జాగ్రత్తలను,మెలుకువలు తదితర అంశాల పైన క్షుణంగా పరశీలించారు.నాణ్యత లేని మొక్కలను గుర్తించి నర్సరీ లోనే కాల్చి వేయాలని చెప్పారు.రైతులకు ఆరోగ్యాకరమైన,నాణ్యమైన, మొక్కలను సరఫరా చేసినట్టు అయితే మంచి దిగుబడులు సాధిస్తారని అన్నారు.మొక్కల పెంపకం లో అలసత్వం వహించకూడదని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య,సాంకేతిక ఉద్యాన అధికారి మహేష్, పతంజలి డి జి ఎం బి యాదగిరి, మేనేజర్ జె హరీష్, నర్సరీ ఆఫీసర్ స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
