Listen to this article

జనం న్యూస్ – జులై- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అర్చకులు రాధా చార్యులు,రామాంజనేయాచార్యులు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండే విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణంతో పాటు ప్రత్యేకమైన పూజా కార్యక్రమంలు నిర్వహించనున్నారు. ఆదిశంకరాచార్య ఆదిగురువు వైష్ణవ మత విశిష్టార్వేత గీతాచార్యులు శ్రీకృష్ణుని ప్రబోదములపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనములతో పాటు ఆచార్య సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.