Listen to this article

జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- ప్రపంచ ఆర్థిక సదస్సు 2025 దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత పదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందాలు కుదుర్చుకుని ముందెన్నడూ లేనిరీతిలో చరిత్ర సృష్టించిందన్నారు. 16 ప్రముఖ కంపెనీలు సుమారు రూ.1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపడమే దీనికి నిదర్శనమన్నారు. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని తెలంగాణ కే గర్వకారణమన్నారు. తెలంగాణను అన్ని రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రజా పాలనే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.