

జనం న్యూస్ – జులై9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
పెట్టుబడిదారుల మెప్పుకోసం కార్మిక వర్గాలను వారి హక్కులను కేంద్ర ప్రభుత్వం బలి చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్, ఏఐటీయూసీ నాయకులు వల్లెపు నాగార్జునలు ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో బుధవారం నాడు సిఐటియు,ఏఐటియుసి మరియు ఇతర కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాను ఖండిస్తూ ఎర్రజెండాలతో హిల్ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాల హక్కులను తూట్లు పొడుస్తూ కేంద్రం 4 కోడ్లను అమలు చేయాలని చూస్తుందని వెంటనే కేంద్రం తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గుజ్జుల కొండలు, కెవిపిఎస్ నాగార్జున,గోవిందు, వెంకట్ రెడ్డి, రామ్ సాయి, శ్యాము నాగమణి దేవయ్య, వసుకుల కాశయ్య, వెంకటరమణ, ఇబ్రహీం యాదయ్య ఖలీల్ గురు భాస్కర్ రెహమాన్ మురళి శివ తదితరులు పాల్గొన్నారు.