Listen to this article

జనం న్యూస్ //జనవరి 25//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లకి సన్మానం చేసారు . తదనంతరం అయన మాట్లాడుతూ..స్థానిక ఎంఎల్ఏ సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి ని ప్రజలే తరిమి కొడుతరన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తె ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
ప్రజలకు మంచి చేస్తా,అంటే కౌశిక్ రెడ్డికి అగం ఆగం అవుతున్నాడన్నారు. కౌశిక్ రెడ్డి నివ్వు ఎంఎల్ఏ వా వీధి రౌడీవా.. గరం అయినారు.గత పదేళ్లలో ఏ ఒక్కరోజైనా గ్రామ సభ పెట్టరా.. అని ప్రశ్నించ్చారు.పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా.. అని నీలదిశారు. ఎమ్మెల్సీ గా,విప్ గా ఉన్న సమయంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇచ్చావా, అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి వాటి అమలుకు కృషి చేయాలని కోరుతున్న, అన్నారు. గత నాలుగు రోజులనుండి గ్రామాల్లో గ్రామ సభలు సజావుగా జరిగాయి కాబట్టి,ప్రతి పక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.నాలుగు పథకాలకు సంబంధించి సర్వే పూర్తిగా జరిగింది అని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా,రేషన్ కార్డులు. సమగ్ర సర్వే లో జరిగిన వాటిని ఆధారంగా పేర్లు వచ్చాయి, అన్నారు.ఒక్కవేల లిస్టులో వారి పేరు లేకపోతే రాబోయే రోజుల్లో కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు, అని ఇది నిరంతర ప్రక్రియ అని,ప్రజలెవరూ అధర్యపడకండి, అని వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగా ప్రభుత్వం,ఇంచార్జి గా నేను కృషి చేస్త నన్నారు .ప్రతి గడప,గడపకు
పథకాలను చేరవేస్తుంది.,అని పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రామ సభలో తక్కువగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే నిన్ను ఉరికించారు.కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏంటో నీకు తెలుసిందా కౌశిక్ రెడ్డి, అని మండిపడ్డారు. మీరు ఎవరు ఆదర్య పడొద్దు, దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందేలా కృషి చేస్తాం అని తెలిపారు. అలాగే రేపటి నుండి నాలుగు పథకాలు ప్రారంభం అవుతాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లతోపాటు, కాంగ్రెస్ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.