Listen to this article

జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూలై 7 నుండి 14 వరకు నిర్వహించబడే పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా, 2025 జూలై 10న కసింకోట మండలంలోని ఏఎస్‌పేట గ్రామం లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో డా. బి. సౌజన్య , సహాయ సంచాలకులు అనకాపల్లి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా. ఆల్ఫొన్సా జార్జ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ డిస్పెన్సరి, నర్సింగబిల్లి నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు వివిధ పశుగ్రాస రకాలు మరియు వాటి సాగుపై అలాగే పశుగ్రాసం నిలువ చేసే పద్దతి మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఏఎస్‌పేట గ్రామానికి చెందిన ఒక రైతు భూమిలో 10 సెంట్లలో సూపర్ నేపియర్ నాట్లు నాటారని. ఇది ఇతర రైతులకు ప్రేరణగా నిలిచేలా ఉందని, కార్యక్రమం రైతుల్లో పశుగ్రాస సాగు మరియు పశు పోషణపై అవగాహన పెంచడంలో ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్ సౌజన్య తెలిపారు.//