

సర్పంచ్ ఎన్నికలలో ఏ రిజర్వేషన్ వస్తుందని ఆందోళన
పార్టీ నమ్ముకున్న వారికి టికెట్ వస్తుందా లేక డబ్బున్న నాయకులకు వస్తున్నా.
(జనం న్యూస్ 9జులై భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి )
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.గ్రామాలలో, పట్టు బిగించుకునేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నవి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలంటూ నేతలు కార్యకర్తలకు సూచనలు మొదలయ్యాయి.గ్రామ ప్రజలతో మమేకం అయ్యేలా నిత్యం జనంలో ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలను శ్రీకారం చేపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు డి అంటే డి అనే విధంగా ప్రచారం చేసే విధంగా జోరుగా కనబడుతుంది.ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఊరులలో జోరుగా చర్చ మొదలైంది. ఏ సమయంలో అయినా స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలో పోటీ చేయాలనుకున్న ఆశావాహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎన్నో ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నా వారి ఆశలు ఇప్పుడైనా నెరవేరుతాయా అని ఆశపడుతున్నారు ఆశావహులు లెక్క రిజర్వేషన్ల విషయంలో చేదు అనుభవం తలుగుతుoదా! అని ఆందోళనల చెందుతున్నారు, పంచాయతీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ వస్తుందా లేక వివిధ పార్టీల నుండి వచ్చిన జంపింగ్ ల కు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు,పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ నే నమ్ముకున్న వారికే టికెట్ వస్తుందా! లేక ఖద్దర్ చొక్కా వేసుకొని డబ్బు పలుకబడి ఉన్న నాయకులకే వస్తుందా? అని పార్టీలో అంతర్గతంగా గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న నాయకులకే స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ వస్తుందా అని ఆందోళనల చెందుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారు ఇప్పటి నుండే యువతను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు జోరందుకున్నాయి.